రీ రిలీస్ కు రెడీ అయిన "ఇంద్ర " మూవీ.

 ఇంద్ర, బి. గోపాల్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ చిత్రం 2002 లో రూపొందించబడింది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా "ఇంద్ర" మూవీని ఆగస్ట్ 22న రీ-రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మూవీ జూలై 2002లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది

అప్పట్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

చిరంజీవితో పాటు ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. శివాజీ కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమా తమిళంలో "ఇందిరన్" పేరుతో, హిందీలో "ఇంద్ర: ది టైగర్" పేరుతో డబ్ అయ్యింది.

ఇంద్ర మూవీ.హిందీ వెర్షన్ టీవీలలో అత్యధికంగా వీక్షించిన దక్షిణ భారత సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ చాలా పాపులర్ అయింది. విజయోత్సవ సభలో స్టేజ్ పై చిరంజీవి స్వయంగా ఈ స్టెప్ వేసి అభిమానుల్ని అలరించారు.